Mamata Banerjee: ఐక్యంగా ముందుకు సాగండనే చెప్తాను! 15 d ago
ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధమేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆ కూటమిని నేనే ఏర్పాటు చేశానన్నారు. ఇప్పుడు దానిని నడిపిస్తున్నవాళ్లకు నిర్వహణ చేతకాకుంటే నేనేం చేయగలను? అని అన్నారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగండనే చెప్తానని తెలిపారు. బెంగాల్‌ను విడిచివెళ్లడం తనకిష్టం లేదన్నారు. అవకాశం లభిస్తే ఇక్కడి నుంచే నడిపిస్తాను’ అని చెప్పారు. ఇక తన వారసుడిని నిర్ణయించే బాధ్యత పార్టీదేనని, సమష్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.